- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ తో విభేదాలపై బండ్ల క్లారిటీ: వారి మధ్య గొడవలు ఉన్నట్లే.. మా మధ్య ఉన్నాయి
దిశ, వెబ్‌డెస్క్: బండ్ల గణేష్.. చిత్ర పరిశ్రమకు కమెడియన్ గా రంగప్రవేశం చేసి.. టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఇక మెగా ఫ్యామిలీ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా ఆయనకు ప్రేమ అని చెప్పడం కన్నా పిచ్చి అని అంటే అతిశయోక్తి కాదు. ఇక నిర్మాతగా కొనసాగుతున్నప్పుడే రాజకీయాలలోకి అడుగుపెట్టి వివాదాలను కొనితెచ్చుకున్న ఈ కమెడియన్.. ఒక ఇంటర్వ్యూలో మా పార్టీ గెలవకపోతే 7 ‘O’ క్లాక్ బ్లేడుతో కోసుకుంటా అని ఛాలెంజ్ చేసి వైరల్ గా మారాడు. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇటీవల ఒక ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మధ్య జరిగిన విభేదాల గురించి నోరు విప్పారు. ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ ‘బాద్ షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించాడు. ఈ చిత్రాల తరువాత బండ్ల, ఎన్టీఆర్ ల మధ్య రెమ్యూనిరేషన్ గొడవలు రావడంతో మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాలేదని టాక్. అప్పట్లో ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఎన్టీఆర్ తో బండ్ల గణేష్ కు ఏవో గొడవలు జరిగినట్లు వచ్చిన వార్తలపై ఎట్టకేలకు బండ్ల నోరు విప్పాడు. “అక్కాచెల్లెళ్ల మధ్య, అన్నాదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం.. ఇది కూడా అలాంటిదే. మిస్ కమ్యూనికేషన్ వలన జరిగిందే కానీ, అనుకోని జరిగింది కాదు. ఎన్టీఆర్ తో జరిగింది గొడవ అనలేం.. ఆయనతో నాకు ఎలాంటి విబేధాలు లేవు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.