- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ అంటే ‘బ్రోకర్ల జనతా పార్టీ’
దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీజేపీ అంటే బ్రోకర్ల జనతా పార్టీ’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభ కార్యాలయంలో హుజూర్‌నగర్, నకిరేకల్ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భువనగిరిలో బండి సంజయ్ మాట్లాడిన మాటలను ఖండించారు. ‘సంజయ్ ఓ నత్తి నారాయణ. ఆయన ఏం మాట్లాడుతాడో అర్థమై చావదు. ఐటీఆర్ఐ అంటే తెలియదు. ఏం చదువుకున్నాడో ఏమో. అలాంటి వ్యక్తి పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడగడం విడ్డూరం. ఆయన బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్. కేసీఆర్ పుణ్యమే ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం అన్న సంగతి తెలుసుకొని మాట్లామాలి. ఆయనకు చట్ట సభలంటే గౌరవం లేదు. ఎమ్మెల్సీని మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అంటారా? ఆయనను లోపల వేసినా తప్పులేదు. రోజూ కుక్కలా అరవొద్దు. ఇనైనా ప్రేలాపనలు మానుకోకపోతే కరీంనగర్‌లో ప్రజలే సంజయ్‌ని చెప్పులతో కొడతారు.’ అని గాదరి కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తీసుకొస్తామని హామీలు ఇచ్చారని, ఇప్పటివరకు ఏ మేరకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దివంగత నేతలకు ఢిల్లీలో ఘాట్లు నిర్మించి పీవీ ఘాట్ మాత్రం నిర్మించలేదన్నారు. పీవీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీజేపీకి లేదన్నారు. పెట్రోల్‌ను కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయని, అయినా కేంద్రం బలవంతంగా అమలు చేస్తే ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. అంబానీ, అదానీలకు మోడీ దేశ సంపాదన దోచి పెడుతున్నారన్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే మోడీ ప్రభుత్వరంగ సంస్థలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నయీమ్ వ్యవహారంలో చట్టప్రకారం చర్యలుంటాయి కానీ, అంతకన్నముందు మోడీ చెప్పిన నల్ల ధనం కక్కించడం గురించి బండి సంజయ్ మాట్లాడాలన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రశ్నించే గొంతులను కాదు, పరిష్కరించే గొంతులైన టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రధానులు అమ్మిదానికంటే డబుల్ అమ్మారని ఆరోపించారు. బోగస్ మాటలు మాట్లడే బీజేపీని నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై బీజేపీ నాయకులకు అవగాహన లేమీతో మాట్లాడుతున్నారని, అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అని ఎద్దేవా చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానల్లోనూ టీఆర్ఎస్ గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.