- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘బండి’ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయ్

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తెలిపారు. కొద్దిసేపటి కిందట ప్రైవేటు డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించగా, షుగర్ లెవల్స్ 70కు పడిపోయాయన్నారు. సోమవారం సాయంత్రం నుంచి సంజయ్ దీక్షలో ఉంటే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు.
ఎంపీ సంజయ్‌ను హత్య చేసేందుకు రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని రాకేష్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో పోలీసులు సంజయ్ గొంతు నులిమే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తాజాగా దీక్ష చేస్తున్న సంజయ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటివరకు వైద్యులను పంపించలేదన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Next Story