విద్యార్థులపై ఉన్న కేసులు వారిపై లేవు..!

దిశ, హుస్నాబాద్:

తెలంగాణ ఉద్యమంలో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ఉన్న కేసులు.. ఏ ఒక్కటి కూడా కేసీఆర్ కుటుంబంపై లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం బైరాన్‎పల్లి మృతవీరులకు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాం అరాచకాలు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు బైరాన్‎పల్లి నాడు రణరంగమైందని అన్నారు. రాష్ట్ర సాధనకు అదే స్ఫూర్తితో యువత ముందుకు సాగిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ కుటుంబం నేడు రాజభోగాలు అనుభవిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్‎కు ఓట్లు, సీట్ల రాజకీయంపై ఉన్న ఆలోచన రాష్ట్ర ప్రజలపై లేదని మండిపడ్డారు.

Advertisement