సాయినార్ ఫార్మా కంపెనీ వద్ద ఉద్రిక్తత

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదం కలకలం రేగుతుంది. టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి సాయినార్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. కంపెనీ బయట ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో కలిసి కంపెనీలోకి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైజాగ్ ను ఫార్మా కంపెనీలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. కంపెనీలపై ప్రభుత్వ నిఘా కరువైందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని ఆయన హితవు పలికారు. విచారణ పేరిట ప్రభుత్వం తాత్సారం చేయడమే వరుస దుర్ఘటనలకు కారణమని ఆయన విమర్శించారు.

Advertisement