స్పైస్ పెయింటింగ్ రికార్డ్ బ్రేక్

by Shyam |
స్పైస్ పెయింటింగ్ రికార్డ్ బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: బనారస్ హిందూ యూనివర్సిటీలో వేదిక్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థి నేహా సింగ్.. నేచురల్ కలర్స్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద ‘స్పైస్ పెయింటింగ్’ వేసి గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. ‘ఆర్ట్’ వేయడం ఓ కళ అయితే, ఆ ఆర్ట్‌కు ఎలాంటి నేపథ్యం ఎంచుకోవాలి, ఎలాంటి రంగులు ఉపయోగించాలి? ఈ సమాజానికి దాంతో ఏం సందేశం ఇవ్వొచ్చు? అనే విషయం కూడా తెలిసుండటం మరో కళగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్, కొత్వారి గ్రామానికి చెందిన నేహాసింగ్ ఆహారం వృథా చేయకూడదంటూ.. నేచురల్​కలర్స్, స్పైసెస్ ఉపయోగించి ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్‌ను వేసి, గిన్నిస్ బుక్‌లో చోటు పొందింది.

‘మోక్ష్ కా వృక్ష్’ పేరుతో 62.72 స్క్వేర్​ మీటర్ల సైజుతో ఆమె వేసిన ఈ పెయింటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా నేహా.. బనారస్ హిందూ యూనివర్సిటీలోనే ఫైన్ ఆర్ట్స్ కూడా చదవడం విశేషం. ఇక తను సాధించిన ఘనతకు బల్లియా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ శ్రీహరి ప్రతాప్ షాహి ఆమెను సత్కరించాడు. గతంలో ఈ రికార్డు (వరల్డ్స్ లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్) విజయవాడకు చెందిన శ్రేయ తాతినేని పేరు మీద ఉండగా, తాజాగా నేహా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. శ్రేయ 588.56 స్క్వేర్ ఫీట్లలో పెయింటింగ్ వేయగా, నేహా 675.11 స్క్వేర్ ఫీట్లలో పెయింటింగ్ వేసింది.

Advertisement

Next Story