అధ్యక్షా ఓ సారి థింక్ చేయండి.. డ్యాన్సర్ ‘ఆర్ట్‌ఫుల్ ప్రొటెస్ట్’

by Sujitha Rachapalli |
అధ్యక్షా ఓ సారి థింక్ చేయండి.. డ్యాన్సర్ ‘ఆర్ట్‌ఫుల్ ప్రొటెస్ట్’
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతి అందాలు, అద్భుతమైన జీవావరణంతో పాటు హంసలకు ఆలవాలమైన రష్యాలోని లేక్‌ను పరిరక్షించాలని కోరుతూ ఓ డ్యాన్సర్.. రష్యా ప్రజలకు వినూత్నంగా పిలుపునిచ్చింది. ఈ మేరకు మంచుతో కూడిన బతరేనియా సరస్సు(హిమానీనదం)పై బాలే డ్యాన్స్ చేసిన వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రష్యా ప్రభుత్వం.. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్‌లోని బతరేనియా లేక్ వద్ద గ్రెయిన్ టర్మినల్‌తో పాటు ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. రష్యా బాల్టిక్ గ్రెయిన్ టర్మినల్ కంపెనీ ఇప్పటికే నిర్మాణ పనులను మొదలుపెట్టింది. అయితే ఈ నిర్మాణాల వల్ల స్థానికులు ఉపాధి కోల్పోవడంతో పాటు జీవావరణం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నిర్మాణాల వల్ల వేసవి, వర్షాకాలాల్లో ఇక్కడకు చేపల వేటకు వచ్చే మత్స్యకారుల పరిస్థితి దుర్భరంగా మారనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలే డ్యాన్సర్ ఇల్మిర బగౌత్ దినోవ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆన్‌లైన్ పిటిషన్ సమర్పించింది. పిటిషన్‌కు మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. కాగా ఇప్పటి వరకు 7,650 మంది పిటిషన్‌కు మద్దతు తెలుపుతూ డిజిటల్ సిగ్నేచర్స్ చేసి, ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును వ్యతిరేకించారు. ‘తనకు, తన కుటుంబానికి మాత్రమే కాకుండా స్థానికులకు ఆ లేక్ అత్యంత ఇష్టమైన ప్రదేశం. హంసలు, ఇతర జంతువులకు నెలవైన ఆ లేక్‌ ప్లేస్‌లో నిర్మాణాలు చేయడం సరికాదు. ఎందుకంటే అత్యద్భుతమైన అలాంటి సహజ ప్రదేశాన్ని మనం నిర్మించలేం’ అని ఇల్మిర బగౌత్ దినోవ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed