'కొడంగల్‌లో తంతే మాల్కాజ్‌గిరిలో.. అక్కడ తంతే ఇంకెక్కడ పడతావో'

by Shyam |
కొడంగల్‌లో తంతే మాల్కాజ్‌గిరిలో.. అక్కడ తంతే ఇంకెక్కడ పడతావో
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌లు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా నాగార్జున సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తంతే మల్కాజ్‌గిరిలో పడ్డారని, అక్కడ తంతే ఇంకెక్కడ పడతారో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకెళ్లారని, మరోసారి జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయమన్నారు. గతంలో పెయింటర్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. తానొక్క పిలుపు ఇస్తే టీఆర్‌ఎస్ కార్యకర్తలు అభిమానులు నీ సంగతేంటో చూస్తారంటూ బాల్క సుమన్ హెచ్చరించారు.

Advertisement

Next Story