బోయపాటి-బాలయ్య మూవీ టైటిల్.. ‘మోనార్క్’

by Jakkula Samataha |   ( Updated:2021-02-18 06:03:55.0  )
బోయపాటి-బాలయ్య మూవీ టైటిల్.. ‘మోనార్క్’
X

దిశ, సినిమా : ‘సింహా, లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. #BB3 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న లభించింది. కాగా మే 28న ఈ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

బాలకృష్ణకు ఇది 106వ సినిమా కాగా.. ప్రగ్యా జైశ్వాల్, సయేషా సైగల్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇక బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనుండగా.. యాక్షన్ సీక్వెన్సెస్‌పై ఫ్యాన్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. ‘మోనార్క్’ టైటిల్ బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మ‌రి ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా? లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed