- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళాకారులను గౌరవించడం నాన్న దగ్గరే నేర్చుకున్నా : బాలయ్య
దిశ, వెబ్‌డెస్క్ :
నందమూరి బాలకృష్ణ నటించిన ‘నర్తనశాల’ దసరా కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సౌందర్య, శ్రీహరి, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దాదాపు 17 నిమిషాల నిడివితో శ్రేయాస్ ఈటీ యాప్‌లో ఎన్బీకే థియేటర్‌లో ఈ నెల 24న రిలీజ్ కానుండగా.. ఈ చిత్రం షూటింగ్ టైమ్‌లో జరిగిన విషయాల గురించి గుర్తు చేసుకున్నారు బాలయ్య.
ఈ సినిమా సౌందర్య, శ్రీహరి లాంటి తారలను మళ్లీ స్క్రీన్‌పై చూపిస్తుండగా.. దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించడం ఈ చిత్రంతో సాధ్యం అవుతుండటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం 10 రోజుల పాటు నటీనటుల డేట్స్ తీసుకుంటే.. కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పాడు. కళాకారులకు గౌరవం ఇవ్వడం నాన్న ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నట్లు తెలిపిన బాలయ్య.. ఈ చిత్రం ద్వారా వచ్చిన వసూళ్లలో కొంత భాగం చారిటీస్‌కు ఉపయోగించనున్నట్లు తెలిపారు.