- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కమిషనర్ కార్యాలయాలు ముట్టడిస్తాం : బజరంగ్ దళ్

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఏర్పాట్లు చేయాలని బజరంగ్ దళ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బజరంగ్ దల్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నవరాత్రి పూజలలో భాగంగా ఇప్పటికే ఐదు రోజులు గడిచి పోయాయని, ఈ నేపథ్యంలో నిమజ్జనం ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ట్యాంక్ బండ్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్‌లతో పాటు నదులు, చెరువుల వద్ద ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.
గురువారంలోగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని లేని పక్షంలో కమిషనర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని ప్రకటించారు. హిందువుల పండుగలను కించ పరుస్తున్న ప్రభుత్వం తప్పకుండా ఫలితం అనుభిస్తుందని అన్నారు.
Next Story