క్షీణించిన ఫిన్‌సర్వ్ లాభం

by Harish |
క్షీణించిన ఫిన్‌సర్వ్ లాభం
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫిన్‌సర్వ్ నికర లాభం 18.06 శాతం క్షీణించి రూ. 986.29 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,203.72 కోట్లుగా ఉంది. బజాజ్ గ్రూప్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలను నిర్వహిస్తున్న హోల్డింగ్ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్ కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ. 15,049.60 కోట్లుగా ఉంది, ఇది గతేడాది రూ. 14,221.9 కోట్లతో పోల్సితే 5.82 శాతం పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగానికి గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చేసింది. ఇతర ప్రతికూల ప్రభావాలతో పాటు కరోనా ప్రభావం వ్యాపారాలపై పడిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్ ధర 0.72 శాతం క్షీణించి రూ. 5,909 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed