- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 నెలల మారటోరియం ఇస్తున్న బజాజ్ ఫైనాన్స్!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని రిజర్వు బ్యాంక్ లోన్ మారటోరియం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గడువును ఆగష్టు 31 వరకు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకులు కూడా కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం వెసులుబాటును అందిస్తున్నాయి. ఇదే బాటలో ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా ఈ అవకాశాన్ని ఇస్తోంది. తమ వినియోగదారులు సైతం మరో 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన పనిలేదని వెల్లడించింది. అర్హత ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 29 నాటికి రెండు కంటే ఎక్కువ ఈఎంఐ ఓవర్ డ్యూస్ లేనివారికే ఈ ప్రయోజనం లభిస్తుందని వివరించింది. జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు ఈ మారటోరియం వర్తిస్తుంది. ఈ వెసులుబాటు పొందడానికి లాగిన్ అయ్యి, ప్రొడక్ట్ సెక్షన్‌లోకి వెళ్లి కోవిడ్ 19 మారటోరియం పాలసీ ఆప్షన్ ఎంచుకోవాలి ఉంటుంది. వినియోగదారులు జూలై నెలకు ఈఎంఐ కట్టకూడదనుకుంటే జూన్ నెల 26వ తేదీ లోపు మారటోరియం ఆప్షన్ ఎంచుకోవాలి. ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత వినియోగదారుకి మెసేజ్ వస్తుంది. కంపెనీ మీ రిక్వెస్ట్ ఓకే చేసిందా? లేదా? అని. ఒకటి కంటే ఎక్కువ రుణాలకు ఈఎంఐ మారటోరియం పొందవచ్చు. ఈఎంఐ మారటోరియం ఆప్షన్ ఎంచుకుంటే లోన్ ఔట్ స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ మొత్తాన్ని లోన్ టెన్యూర్ పొడిగింపు ద్వారా కంపెనీ వసూలు చేస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉన్నవారు లోన్ మారటోరియం పొందితే వారికి కూడా వడ్డీ పడుతుంది.