- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బజాజ్ ఆటో లాభంలో 53 శాతం క్షీణత!
దిశ, వెబ్‌డెస్క్: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. తొలి త్రైమాసికానికి బజాజ్ ఆటో స్వతంత్ర లాభం 53 శాతం క్షీణించి రూ. 528 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,125.67 కోట్లుగా ఉండేది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ. 3,079.24 కోట్లు నమోదవగా, గతేడాది ఇదే కాలంలో రూ. 7,755.82 కోట్లుగా ఉండేదని బజాజ్ ఆటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, ఎబిటా గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,198 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 408.5 కోట్లని కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం రూ. 376 కోట్లకు తగ్గగా, పన్నుకు ముందు లాభం రూ. 1579 కోట్ల నుంచి రూ. 682 కోట్లకు తగ్గింది. కరోనా వల్ల దేశీయ మోటర్ సైకిల్ దిగ్గజం ఏప్రిల్ నెలలో అమ్మకాలు జరపలేదు. మేలోను ఇంచుమించు ఇదే స్థాయిలో ప్రభావాం ఉన్నప్పటికీ, జూన్ నాటికి కొంత కోలుకున్నట్టు కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనా సంక్షోభం వల్ల దేశీయ మార్కెట్లో వాణిజ్య వాహనాలపై తీవ్రమైన ప్రభావం ఉందని, ఈ పరిశ్రమ 91 శాతం క్షీణించిందని బజాజ్ ఆటో పేర్కొంది. తొలి త్రైమాసికానికి బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో మొత్తం 42.6 శాతం వాటాను కలిగి ఉంది. ‘కరోనా వల్ల కంపెనీకి ప్రతికూల ప్రభావం తప్పలేదని, క్రమంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. సవాళ్లు ఉన్నప్పటికీ కంపెనీ వాటాదారులతో చర్చిస్తూ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తుందని బజాజ్ ఆటో వెల్లడించింది.