దళిత యువకుడిపై దాడి హేయమైన చర్య

by Shyam |
దళిత యువకుడిపై దాడి హేయమైన చర్య
X

దిశ, మెదక్: మంచిర్యాల జిల్లా జిన్నారం‌లో ఇటీవల బొట్ల అన్వేష్ అనే దళిత యువకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితునికి ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకోవాలన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొట్ల అన్వేష్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడన్ననెపంతో దారుణంగా కొట్టడం బాధాకరమన్నారు. ఒక వైపు కులాంతర వివాహాలు చేసుకోవాలని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటే. ఇలాంటి ఘటనలు జరగడం అమానుషమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed