- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రణ్‌బీర్ ఆ పాత్రకు సరిపోడు.. మరో యంగ్ హీరో కావాలంటున్న భన్సాలీ

దిశ సినిమా: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘బైజు బవ్రా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం మూవీ ప్రధాన పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ను మేకర్స్ ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తుండగా.. ఆయనకు జోడీగా అలియాభట్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గల్లీబాయ్’ మంచి విజయం సాధించడమే ఇందుకు కారణమని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక “ఈ చిత్రంలో హీరో పిచ్చిగా వ్యవహరించే ఒక విభిన్నమైన పాత్ర ఉంటుంది. అలాంటి పాత్రకు రణ్‌వీర్ అయితేనే సరిగ్గా సరిపోతాడని భన్సాలీ ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాడు. అలాగే అలియా ఈ కథ చదివి ఎంతో ఆసక్తిని కనబరిచింది” అని భన్సాలీ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తుండగా.. ప్రేక్షకులు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం వేచిచూస్తున్నారు.
- Tags
- Baiju Bawra