బద్వేలు బీజేపీ అభ్యర్థి ఖరారు

by srinivas |
BJP-Candidate1
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక రోజురోజుకు ఉత్కంఠ రేపుతుంది. ఈ ఉపఎన్నికలో పోటీ చేయాలని తొలుత టీడీపీ భావించింది. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థిని బరిలోకి దించింది. చివరకు నైతిక విలువలకు కట్టుబడి ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అలాగే జనసేన కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. అయితే బీజేపీ మాత్రం పోటీ చేసి తీరుతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా పుంతల సురేశ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇకపోతే పుంతల సురేశ్ ఏబీవీపీ, బీజేవైఎంలలో కీలకంగా వ్యవహిరించారు. ఇకపోతే బద్వేలు ఉపఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. కమలమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే. మెుత్తానికి బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించడంతో పోటీ తప్పదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed