- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ రాజ్యమేలుతోంది
దిశ, ఖమ్మం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం టేల్పాండ్ సందర్శనకు వెళ్తున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదె౦ వీరయ్యను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే దుమ్మగూడెంకు బయల్దేరిన విషయం తెలుసుకున్న పోలీసులు భద్రాచలం ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద అడ్డుకుని నిర్బంధించారు. దీంతో అక్కడే చాలాసేపు వీరయ్య తన అనుచరులతో కలసి బైఠాయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అరెస్టు చేయటం అవివేకమని ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనాలకు కళ్లబొల్లి మాటలు జెప్పి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. గోదావరి పరివాహకంలోని జిల్లాలకు నీళ్లందకుండా ఎడారీగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు.అనంతరం పోలీసులు పొదెం వీరయ్యతో పాటు ఆయన అనుచరులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, బోగాల శ్రీనివాసరెడ్డి, వనం బాబు, నక్కా ప్రసాద్, అన్యం వెంకటేశ్వరెడ్డి, రాచమల్ల రాము, సరెళ్ల నరేష్, బలుసు సతీష్ అరెస్టయ్యారు.