పుట్టిన రోజు బాయ్ ఫ్రెండ్ రింగ్ తొడిగాడు

దిశ, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ స్టార్ (Badminton star) గుత్తా జ్వాల సోమవారం 37వ పడిలోకి అడుగుపెట్టారు. ఆమె గత కొన్నాళ్లుగా కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జ్వాలా పుట్టిన రోజు నాడు విష్ణు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆమె పుట్టిన రోజు నాడే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విష్ణు, ఆమెకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగాడు.

ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్వాలా. మన జీవితానికి ఇది కొత్త ప్రారంభం. ఇలాగే పాజిటివ్‌గా జీవిద్దాం. మన కుటుంబం, స్నేహితులు అందరి భవిష్యత్ కోసం కృషి చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని విష్ణు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. గతంలో కూడా లాక్‌డౌన్ సమయంలో జ్వాలా తన ప్రియుడిని కలుసుకోవడానికి అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు విష్ణు కూడా అలాగే వచ్చి, స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Advertisement