గాంధీలో ఘోరంగా దుర్వాసన!

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో దుర్వాసన వస్తోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అక్కడి ప్రజలు ఈ దుర్వాసనను తట్టుకోలేక ఇండ్లు ఖాలీ చేసి వెళ్లిపోతున్నారంట. ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది, ఇతరులు ఈ దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారంట. ఈ విషయం గూర్చి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

విషయమేమిటంటే.. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడికి ఎక్కువ సంఖ్యలో కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటున్న విషయం విధితమే. అయితే, ప్రస్తుతం గాంధీలో కరోనాకు సంబంధించి డాక్టర్లు, రోగులు, హెల్త్ వర్కర్స్, సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు, ఇంజెక్షన్లు, మందులు, ఇతర చెత్త అంతా కూడా ఆస్పత్రి ఆవరణలో ఓ చోట వేస్తున్నారు. దీంతో రోజురోజుకూ అది పెద్ద కొండలా పేరుకుపోయింది. దీంతో గాంధీ ఆస్పత్రి, చుట్టుపక్కల దుర్వాసన వెదజల్లుతోంది. ఈ దుర్వాసనను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారంట. ఆస్పత్రి సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారంట. ఉన్నతాధికారులు స్పందించి ఈ చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement