వెనక్కెళ్లి ముందుకొచ్చిన సముద్రం

by Shamantha N |
వెనక్కెళ్లి ముందుకొచ్చిన సముద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడు అలల తాకిడితో కాసింత ముందుకు వెనక్కి వెళ్లే సముద్రం ఒక్కసారిగా మరింత వెనక్కి మరలింది. మరుసటి రోజునే మళ్లీ యథాస్థితికి చేరుకుంది. ఇలానే 2004లో జరిగి.. యథాస్థితికి చేరుకున్న రోజునే భారీ సునామీ ముంచెత్తిందని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన ఇప్పడు కన్యాకుమారి తీరంలో మరింత ప్రకంపనలు రేపుతోంది.

తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఏకంగా సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. ఏకంగా వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహం వద్ద సముద్రపు అడుగున ఉన్న రాళ్లు తేలాయంటే పరిస్థితిని ఊహించవచ్చు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం కలిసే చోటే ఇలా జరుగుతోంది. అయితే, అమావాస్య-పౌర్ణమి రోజే ఇలా సముద్రం హెచ్చుతగ్గులు అవుతుంటోందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed