ఆ ఘటన బాధాకరం: చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని పారిశ్రామికవాడ పరవాడలోని సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఇంకా మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. వరుస గ్యాస్ లీకేజీలతో వైజాగ్ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాస్ లీకేజీ బాధితులకు వెంటనే అత్యుత్తమ వైద్యసాయమందించాలని సూచించారు.

Advertisement