బాబ్లీ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేత

by Aamani |   ( Updated:2021-07-01 23:46:36.0  )
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మహారాష్ట్రలోని ధర్మబాద్ వద్ద గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. గురువారం ఉదయం 3 గేట్లు సీడబ్ల్యూసీ, ఉమ్మడి రెండు రాష్ట్ర నీటి పారుదల అధికారుల సమక్షంలో ఎత్తిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వరకు అధికారులు మొత్తం 14 గేట్స్ ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్లో 0.93 టీఎంసీల నీరు ఉండగా.. అది 80 కిలోమీటర్లు ప్రవహించి శ్రీరాం సాగర్‌కు చేరుకుంటాయి. తెలంగాణ సరిహద్దు త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం గోదావరి పరవళ్లు తొక్కుతుంది.

ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో గురువారం 27 టీఎంసీల నీరు ఉండగా.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 28.682 టీఎంసీల నీరు ఉంది. గత 24 గంటల్లో ఒక టీఎంసీ నీరు వచ్చి చేరింది. సుమారు 20,299 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్ట్ ఎఈఈ వంశీ తెలిపారు. టోటల్ 647 అవుట్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీరాం ప్రాజెక్ట్ లోకి జూన్ 1 నుంచి ఇప్పటివరకు 11.95 టీఎంసీల గోదావరి నీరు వచ్చి చేరింది.

Advertisement

Next Story