- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాబా రామ్‌దేవ్ క్షమాపణలు చెప్పాలి : కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : ఆధునిక శాస్త్రీయ చికిత్సను, వైద్యులను తృణీకరిస్తూ వ్యాఖ్యలు చేసిన యోగా గురువు బాబా రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. అల్లోపతిక్ మెడిసిన్స్‌పై రామ్‌దేవ్ వ్యాఖ్యలు బాధాకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు కరోనా వారియర్లను అగౌరవపరచడమే కాదు, దేశ సెంటిమెంట్లనూ గాయపరిచేలా ఉన్నాయని తెలిపారు.
ఆయన స్టేట్‌మెంట్ వైద్యుల మనోభావాలను దెబ్బతీసి కరోనాపై పోరును బలహీనపరిచేలా ఉన్నాయని వివరించారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్‌దేవ్‌కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అల్లోపతి అనేది పనికిమాలిన శాస్త్రమని, కరోనాను నియంత్రించడంలో డీసీజీఐ ఆమోదించిన రెమిడిసెవిర్, ఫావిఫ్లూ, ఇతర ఔషధాలు విఫలమయ్యాయని రామ్‌దేవ్ బాబా పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లోపతిక్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత లక్షలాది మంది పేషెంట్లు మరణించారనీ రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అవాస్తవాలుగా పతంజలి యోగా పీఠ్ కొట్టిపారేసింది.