హెచ్‌సీఏపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-06-17 02:53:18.0  )
హెచ్‌సీఏపై అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఏకంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌నే తొలగిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ రూల్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అజార్‌పై కేసులు పెండింగ్‌లో ఉండటంతో హెచ్‌సీఏలో అజార్‌ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే దీనిపై అజారుద్దీన్ స్పందించారు. ఉద్దేశ పూర్వకంగానే నాకు నోటీసులు జారీ చేశారంటూ మండిపడ్డాడు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు, వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా అని అజారుద్దీన్ అన్నారు అన్నారు. అదేవిధంగా అవినీతినీ అరికట్టడానికి అంబుడ్స్‌మన్‌ను నియమిస్తే అడ్డుకున్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై ఇన్ని కుట్రలు పన్నారని పేర్కొన్నారు. హెచ్‌సీఏ రాజ్యంగాన్ని ఆ ఐదుగురు ఖూనీ చేస్తున్నారని మండి పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed