- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో ఏడాదిన్నరలో యాక్సిస్ బ్యాంక్ చేతికి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ రానున్న 12-18 నెలల్లో ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్స్‌లైఫ్‌లో తన వాటాను 20 శాతనికి పెంచే అవకాశం ఉందని మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెనెస్ సీఈఓ ప్రశాంత్ త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకుకు అనుబంధంగా యాక్సిస్ కేపిటల్ లిమిటెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మ్యాక్స్‌లైఫ్‌లో యాక్సిస్ బ్యాంకుకు 12.99 శాతం కలిగి ఉంది. ‘యాక్సిస్ బ్యాంక్ వాటా 19.99 శాతానికి పెరగనుంది. ఇప్పటికే 13 శాతం పూర్తయింది. మిగిలిన 7 శాతం వాటాను ఇచ్చేందుకు అనుమతి తీసుకుంటాం. దీంతో సుమారు 20 శాతానికి యాక్సిస్ బ్యాంక్ వాటా చేరుకుంటుంది.
తద్వారా మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని యాక్సిస్ బ్యాంక్ యాజమాన్య పరిధిలోకి వెళ్తుందని ప్రశాంత్ త్రిపాఠి వివరించారు. మ్యాక్స్ లైఫ్ సంస్థ బ్రాండ్‌లో ఎలాంటి మార్పు ఉండదని, అయితే జాయింట్ వెంచర్ భాగస్వామిగా యాక్సిస్ బ్యంకు ఉంటుందని ప్రశాంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో వృద్ధి సాధించేందుకే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మ్యాక్స్ ఇన్సూరెన్స్ సంస్థ పరిశ్రమ వృద్ధి కంటే వేగంగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి యాక్సిస్ బ్యాంకుతో కలిసి పనిచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ ఏడాది మార్చితో ఆర్థిక సంవత్సరంలో మొత్తం కొత్త వ్యాపార ప్రీమియం 22 శాతం పెరిగి రూ. 6,826 కోట్లకు చేరుకుంది. అలాగే, రెన్యువల్ ప్రీమియం ఆదాయం 15 శాతం పెరిగి రూ. 12,192 కోట్లుగా ఉంది.