అమ్మా.. అప్రమత్తంగా ఉండండి

దిశ సూర్యాపేట: జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేయవచ్చు అన్నారు. ఇండ్లు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం వార్డు ప్రజల సమస్యలపై చర్చించి వాటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ వరుణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement