ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెంచాలి: మంత్రి హరీశ్‌రావు

by  |
ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెంచాలి: మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్
చెత్త సేకరణ, ప్లాస్టిక్ నివారణపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన పెంచాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలంతా తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని తన నివాసంలో శుక్రవారం మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, ప్లాస్టిక్ నివారణ అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. వచ్చే 3 వారాల్లో తడి, పొడి, హానికరమైన చెత్త, ప్లాస్టిక్ నివారణ, స్టీల్ బ్యాంకు ఉపయోగాలపై, ప్రత్యామ్నాయ మార్గాలపై మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ తడి, పొడి, హానికరమైన చెత్త, ప్లాస్టిక్ నివారణతో పాటు బల్క్‌లో వచ్చే చెత్త పై దృష్టి సారించాలని తెలిపారు. దీనిపై అదనపు జిల్లా కలెక్టర్ ముజంబీల్ ఖాన్ ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ కౌన్సిలర్లు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, బెంగళూరుకు చెందిన ప్రముఖ వైద్యులు శాంతి, మున్సిపల్ శానిటరీ ఇన్స్‌‌స్పెక్టర్లు పాల్గొన్నారు.-

Tags: finance minister harish rao, awareness on plastic, Garbage collection,long review meeting


Next Story

Most Viewed