- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి.
దిశ, పరకాల: సెప్టెంబర్ 11వ తేదీన జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ పట్ల ముద్దాయిలకు, ఫిర్యాదుదారులకు అవగాహన కల్పించి దీర్ఘకాలికంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకునేల ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని పరకాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హుస్సేన్ నాయక్ తెలిపారు. శనివారం పరకాల భూపాలపల్లి ఏసీపీ ల పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు సిఐలు కోర్ట్ కానిస్టేబుల్లతో జూనియర్ సివిల్ కోర్టు పరకాలలో శనివారం క్రైమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
పరకాల ఏసీపీ శివరామయ్య భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జడ్జి హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ కొంతమంది తెలిసో తెలియకో జరిగిన నేరాల మూలంగా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. అలాంటివాళ్లు సత్ప్రవర్తన కలిగి సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లైతె అలాంటి వారికి నేరప్రవృత్తి నుంచి పంపించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అందులో భాగంగానే జాతీయ లోక్ అదాలత్ అవకాశం కల్పిస్తుందన్నారు. అందుకు పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులను పరిశీలించి ముద్దాయిలకు ఫిర్యాది దారులకు అవగాహన కల్పించి రాజీ కుదుర్చేలా ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జెఎఫ్ సీఎం దిలీప్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల భద్రయ్య, సిఐలు ఎస్ఐలు ఎక్సైజ్ అధికారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.