- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాతగా మారిన చిన్నారి పెళ్లి కూతురు
దిశ, సినిమా: ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో బాలనటిగా ఆకట్టుకున్న అవికా గోర్ హీరోయిన్‌గానూ ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అడుగువేస్తూ నిర్మాతగా మారిపోయింది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగులో సినిమాను నిర్మించబోతోంది. ఆచార్య క్రియేషన్స్‌తో కలిసి సంయుక్తంగా చిత్రనిర్మాణానికి సిద్ధం కాగా.. సాయి రోనక్, అవికా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించాలని అవికను కోరారట. అయితే కథ నచ్చడంతో ఆచార్య క్రియేషన్స్‌తో కలిసి తనే సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. చిన్నతనం నుంచి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అవిక.. ప్రతీ విషయాన్ని దగ్గరుండి గమనించానని, అందుకే ప్రొడక్షన్‌లోకి రావాలనుకున్నానని తెలిపింది. నిర్మాతగా తన తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నానన్న హీరోయిన్.. ఒకరంటే ఒకరికి విపరీత ద్వేషం ఉన్న హీరోహీరోయిన్లు తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితిలో చిక్కుకుంటే ఏం జరుగుతుందనేదే కథ అని వివరించింది. కాగా త్వరలోనే సినిమా టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడించనున్నారు.