4 లక్షల ఉద్యోగాలిచ్చాం.. నిరుద్యోగ భృతి అక్కర్లేదు: అవంతి

by srinivas |
4 లక్షల ఉద్యోగాలిచ్చాం.. నిరుద్యోగ భృతి అక్కర్లేదు: అవంతి
X

4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలోని రుషికొండ ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ సెమినార్ హాల్‌లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారీ ఎత్తున ఉపాథి అవకాశాలు కల్పించిన నేపథ్యంలో నిరుద్యోగభృతి అవసరం లేదని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నాలుగేళ్లు ఎగ్గొట్టి ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా కొద్ది మందికి ఇచ్చిందన్నారు. భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రెండున్నర లక్షల మంది గ్రామ వలంటీర్లు కాగా, మరో లక్షన్నర గ్రామసచివాలయ సిబ్బంది ఉన్నారన్నారు. వచ్చేఏడాది నుంచి ఏటా జనవ రిలో ఉద్యోగమేళా పెట్టి అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. అందులో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల సెట్విన్ సీఈవోలు, మేనేజర్లు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..!

Advertisement

Next Story

Most Viewed