అర్ఆర్ఆర్‌పై ఆయన మరోసారి ఫైర్

by srinivas |
అర్ఆర్ఆర్‌పై ఆయన మరోసారి ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ రెబెల్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి ఫైర్ అయ్యారు. నిన్న రఘురామ కృష్ణంరాజుపై విమర్శలు చేయడంతో రఘురామ కృష్ణంరాజు రిటార్ట్ ఇచ్చారు. దీంతో అవంతి శ్రీనివాస్ మరోసారి రఘురామ కృష్ణంరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చించారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే ఏపీ ప్రజలు క్షమించరని అన్నారు. వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story