పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం

by srinivas |   ( Updated:2020-09-05 09:30:15.0  )
Minister Avanthi Srinivas
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 20న జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు విధి విధానాలను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. టూర్ ఆపరేటర్లు, అనుబంధ రంగాల వారు ప్రభుత్వం అందించే రాయితీలను, ప్రోత్సాహకాలను పొందవచ్చని తెలిపారు. మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి వివరాలు www.aptourism.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చామన్నారు . టూర్ ఆపరేటర్ల , బోటు ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లు, హెూటల్స్, రిసార్ట్సు, మైస్ సెంటర్లు, వాటర్ స్పోర్ట్సు ఆపరేటర్లు తదితర అనుబంధ రంగాల ఆపరేటర్లను పర్యాటక శాఖతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తద్వారా రాయితీలను, ప్రోత్సాహాలను పొందాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed