- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్ఆర్ఆర్‌కి అవంతి వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ భిక్షతో పార్లమెంటులో అడుగు పెట్టిన రఘురామకృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి చరిష్మాతో మాత్రమే నాగబాబుపై గెలుపొందారని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ జెండాపై గెలిచి టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. నర్సాపురం వరకు పరిమితమైతే మంచిదని, కాదని అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదని హెచ్చరించారు. విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణం రాజు ఎవరు?అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే చంద్రబాబు నాయుడుని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా ప్రజలు అడ్డుకున్నారని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు తెలుసని అదే పనిగా వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చడం తగదు. వైఎస్సార్సీపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన సూచించారు. నలందా కిషోర్ అనారోగ్యంతో మృతిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. నలంద కిషోర్ టీడీపీ అభిమాని అన్న ఆయన, ఆయన మరణానికి తాము కూడా సంతాపం తెలియజేస్తున్నామని చెప్పారు.