- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జులై చివరికల్లా రోజుకు కోటి డోసుల లభ్యత: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయాలని భావిస్తున్నామని, అందుకు తగిన స్థాయిలో టీకాల లభ్యతను పెంచుతామని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ అన్నారు. జులై చివరికల్లా లేదా ఆగస్టు తొలినాళ్లలో రోజుకు ఒక కోటి టీకా డోసులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందుకు కొంచెం ఓపిక పట్టాలని, టీకా ఉత్పత్తి సంస్థలు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, కొత్త సంస్థలకూ అనుమతులు ఇస్తున్నామని ఆయన వివరించారు. సమీప భవిష్యత్‌లో టీకా కొరత ఉండబోదని అంచనా వేశారు. అమెరికాతో పోల్చితే నాలుగు రెట్ల జనాభా గల మనదేశంలో అందరికీ టీకా వేయడానికి కొంత సహనంగా ఉండాలని అన్నారు.
సెకండ్ వేవ్‌ను లాక్‌డౌన్ లాంటి కఠిన ఆంక్షలతో నియంత్రణలోకి తెచ్చుకున్నామని, కానీ, ఎప్పుడూ ఈ వ్యూహం సత్ఫలితాలనివ్వకపోవచ్చని తెలిపారు. వ్యాక్సినేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలింపులు చేస్తున్న విధంపై స్పందిస్తూ రీఓపెనింగ్ చాలా నెమ్మదిగా చేపట్టాలని సూచించారు. అది కూడా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలుండాలని వివరించారు. పాజిటివిటీ రేటు ఐదు లోపే ఉండాలని, రిస్క్ ఎక్కువ ఉన్న ఏజ్ గ్రూప్‌వాళ్లలో 70శాతం మంది టీకా తీసుకుని ఉండాలని, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలవుతూ ఉండాలని తెలిపారు.