Hyundai Creta: హ్యుందాయ్ నుంచి రెండు కొత్త వేరియంట్లు విడుదల.. ధర ఎంతంటే?

by Vennela |
Hyundai Creta: హ్యుందాయ్ నుంచి రెండు కొత్త వేరియంట్లు విడుదల.. ధర ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. ఇటీవలే క్రెటా ఎలక్ట్రిక్ భారతదేశంలో ప్రారంభించింది. దీనికి కస్టమర్ల నుండి చాలా మంచి స్పందన వస్తోంది. క్రెటా(Creta) రెండు కొత్త వేరియంట్ల(New variants) ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్ (Hyundai Motor)ఇండియా తన మిడ్-సైజ్ SUV క్రెటాను భారత్ లో రెండు కొత్త వేరియంట్ల(New variants)ను లాంచ్ చేసింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta) . ఇటీవలే క్రెటా(Hyundai Creta) ఎలక్ట్రిక్ భారతదేశంలో ప్రారంభించింది. దీనికి కస్టమర్ల నుండి చాలా మంచి అనూహ్య వస్తోంది. క్రెటా రెండు కొత్త వేరియంట్లలో ఉన్న ప్రత్యేక ఫీచర్లు, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta) కు రెండు కొత్త వేరియంట్లు జోడించింది. ఈ వేరియంట్‌లను కంపెనీ మార్చి 2025లో ప్రవేశపెట్టింది. ఈ వేరియంట్లలో ఒకటి EX (O) పేరుతో ప్రవేశపెట్టగా.. మరొక వేరియంట్ SX ప్రీమియంగా తీసుకువచ్చింది. కంపెనీ ప్రకారం, హ్యుందాయ్ క్రెటా EX (O) లో పనోరమిక్ సన్‌రూఫ్, LED రీడింగ్ లాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రెటా కొత్త వేరియంట్‌(Hyundai Creta) గా SX ప్రీమియం కూడా లాంచ్ చేసింది.

ఇక దీని ఫీచర్లను చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ వెంటిలేటెడ్ సీట్లు, 8 వే పవర్ డ్రైవర్ సీటు, బోస్ ప్రీమియం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. దీనితో పాటు, హ్యుందాయ్ క్రెటా SX (O) వేరియంట్‌లో రెయిన్ సెన్సార్, వెనుక వైర్‌లెస్ ఛార్జర్, స్కూప్డ్ సీట్లు అందించింది. S(O) వేరియంట్‌లో స్మార్ట్ కీతో పాటు మోషన్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ SUV టైటాన్ గ్రే మ్యాట్‌తో స్టార్రి నైట్ కలర్‌లో పరిచయం చేశారు.

ధర:

హ్యుందాయ్ క్రెటా EX (O) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.97 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కాగా, SX ప్రీమియం ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.18 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ SUV ని కొత్త వేరియంట్లతో రూ. 20.18 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

కాగా హ్యుందాయ్ క్రెటా, MG హెక్టర్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, కియా సెల్టోస్, టాటా హారియర్ వంటి SUV లతో నేరుగా పోటీపడుతుంది.

Next Story

Most Viewed