- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికవరీ కనిపిస్తున్నా.. వాల్యూమ్ పరంగా ఐదేళ్ల వెనక్కి!
దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీదారులు డీలర్‌షిప్‌ల వద్ద తమ వాహన నిల్వలను పెంచాయి. దీంతో సెప్టెంబర్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పటిష్టమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇండస్ట్రీ బాడీ దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ గణాంకాల ప్రకారం..సెప్టెంబర్‌లో ప్రయాణీకుల వాహన అమ్మకాలు 2,72,027 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది ఇదే నెలలో విక్రయించిన 2,15,124 యూనిట్లతో పోలిస్తే 26.45 శాతం అధికం. టూ-వీల వాహనాల అమ్మకాలు 11.64 శాతం పెరిగి 18,49,546 యూనిట్లకు చేరుకున్నాయి.
త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు 72 శాతం క్షీణించి 18,640 యూనిట్లకు చేరుకున్నాయి. ‘సెప్టెంబర్‌లో వాహనాల అమ్మకాల్లో బలమైన వృద్ధిని చూస్తున్నప్పటికీ, అనేక విభాగాల్లో వాల్యుమ్‌ల పరంగా ఐదేళ్ల క్రితం నాటి స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి. పండుగ సీజన్‌లో ప్యాసింజర్ వాహనాలు, టూ-వీలర్ వాహనాలకు బలమైన డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నాం. అనంతరం డిమాండ్ ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం, దానికోసం మరికొద్ది నెలలు వేచి ఉండక తప్పదు’ అని సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవా చెప్పారు.