55 శాతానికి తగ్గిన ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు

by Harish |
55 శాతానికి తగ్గిన ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో వాహనాల రిజిస్ట్రేషన్లు క్షీణించాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 55 శాతం తగ్గాయని ఆటోమొబైల్ పరిశ్రమ సంఘం ఫాడా గురువారం తెలిపింది. మే నెలలో చాలావరకు షోరూమ్‌లు మూసివేయడం జరిగిందని దీంతో అన్ని కార్యకలాపాలు దెబ్బతిన్నాయిన్నారు. ఏప్రిల్‌లో మొత్తం 11,85,374 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగ్గా, మేలో ఇది 5,35,855 యూనిట్లకు పడిపోయాందని పేర్కొన్నారు.

మొత్తం 1,294 ప్రాంతీయ రవాణా కార్యాలయాల(ఆర్‌టీఓ) నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ల డేటాను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) గురువారం వెల్లడించింది. ఇందులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మేలో 59 శాతం క్షీణించాయి. అలాగే, కమర్షియల్ వాహనాల అమ్మకాలు 66 శాతం తగ్గి 17,534 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ అమ్మకాలు 76 శాతం పడిపోయి 5,125 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్ అమ్మకాలు సైతం 57 శాతం పడిపోయి 16,616 యూనిట్లుగా వెల్లడైంది. ‘కరోనా సెకెండ్ వేవ్ వల్ల మొత్తం దేశం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటొందిన్నారు. ముఖ్యంగా పట్టణ మార్కెట్లతో పాటు గ్రామీణ మార్కెట్లు సైతం దెబ్బతిన్నాయని’ ఫాడా అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed