- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పు చెల్లించాలని అడిగిన మహిళను ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ ఆటో డ్రైవర్ మహిళపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోలో నుంచి కిందకు దిగి తన్నడంతో ఆమె ఎగిరిపడింది. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
విజయవాడ రాణిగారి తోటలో నివసిస్తున్న గోవర్ధని అనే మహిళ, తాడేపల్లి మహానాడులోని ఆటోడ్రైవర్ గోపికృష్ణకు మూడు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. కొంతకాలంగా తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే మంగళగిరి మండలం రామచంద్రపురం సమీపంలో గోపికృష్ణ ఉన్నాడని తెలుసుకున్న గోవర్ధని అక్కడికి చేరుకుని అతడి ఆటోకు తన బైకును అడ్డం పెట్టింది. డబ్బులు అడుగుతుంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆటోలో కూర్చున్న గోపికృష్ణ ఒక్కసారిగా ఇష్టారీతిన దూషిస్తూ.. గోవర్ధనిని కాలితో తన్నాడు. దీంతో ఆమె నాలుగడుగుల దూరంలో పడిపోయింది. డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. గోవర్ధని ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి రూరల్ ఎస్ఐ లోకేష్ నిందితుడు గోపికృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
నిందితుడును అదుపులోకి తీసుకున్నాం : ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
రామచంద్రాపురం కృష్ణా కరకట్ట వద్ద మహిళపై దాడి ఘటనకు సంబంధించి అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళను ఆటో డ్రైవర్ కొట్టిన వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై వెంటనే స్పందించి మహిళల భద్రత ప్రధాన అంశంగా భావించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిపై 354,323,506,509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.