వారి అభిప్రాయాలు తెలుసుకోండి

by Shyam |

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
కోవిడ్-19 కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు పున:ప్రారంభం కాలేదు. కాబట్టి ప్రారంభం కోసం ప్రతి పాఠశాలలోని అందరి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి జనార్ధన్ రావు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలు ఏ మాసంలో పునర్ ప్రారంభం కావాలి అని అభిప్రాయాలను సేకరించాలని కోరారు. పాఠశాలలు పునర్ ప్రారంభం అయిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో విద్యా బోధన, వైరస్ నుంచి రక్షణకు ఏ విధమైన చర్యలను కోరుతున్నారు అనే అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారి ద్వారా డీఈఓ కార్యాలయానికి ఈ నెల 25 వరకు పంపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed