- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా వరదనీరు.. ఎస్‌ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత
దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండి, 4 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక గంట ప్రాంతంలో ప్రాజెక్టుకు చెందిన 8 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కులను ఎస్కేప్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 1091 అడుగులకు గాను 1090 అడుగుల నీరు, 84.810 టీఎంసీల నీరు ఉండడంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం గంటకు 432433 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా 50 క్యూసెక్కులు, ఆర్ సి గేట్ల ద్వారా 20 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభం కావడంతో జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గోదావరి నది పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.