- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ పై ఆసీస్ గెలిచిందిలా
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు టీ20 సిరీస్ (T20 Series)ను కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డే (First ODI)లో మాత్రం ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం సాధించింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు గెలుపు దిశగా సాగుతుండగా, ఆసీస్ పేసర్ హాజెల్‌వుడ్ 3/26తో చెలరేగడంలో 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 123 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే మిడిల్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ (73), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77) రాణించడంతో ఇన్నింగ్స్ నిలబడింది. వీరిద్దరూ కలసి ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 294 పరుగులకు చేరింది.
295 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును ఆసీస్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. హాజెల్‌వుడ్, ఆడం జంపా దెబ్బకు కేవలం 57 పరుగులకే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. కాగా, ఓపెనర్ బెయిర్ స్టో (84), సామ్ బిల్లింగ్స్ (118) జట్టు ఇన్నింగ్స్‌లో పరుగుల వరద పారించి.. ఇంగ్లాండ్ జట్టును విజయం వైపు నడిపిస్తున్న తరుణంలో బెయిర్ స్టోను హాజెల్‌వుడ్ అద్భుతమైన క్యాచ్ ద్వారా పెవిలియన్ పంపాడు.
అయితే, టెయిలెండర్లు (Tailenders) విఫలం కావడం, సామ్ బిల్లింగ్స్‌కు ఎవరూ తోడు లేకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 275 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ జట్ట 19 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.