10 నిమిషాల వ్యవధిలో అత్తాకోడలు మృతి

దిశ, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని పొదమూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పది నిమిషాల తేడాతో అత్తాకోడలు మృత్యువాత‌పడటం ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే… పొదమూరులో పల్నాటి నర్సయ్య కుటుంబం నివాసం ఉంటోంది. నర్యయ్య తల్లి లక్ష్మీ(90) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతూ నేడు ఉదయం 5 గంటలకు మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న నర్సయ్య భార్య మంజుల(45) అత్త మృతదేహం వద్దకు వెళ్లి బోరున విలపిస్తూ గుండెపాటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలింది. ఊహించని పరిణామానికి స్థానికులు నిష్ఠేశ్చులయ్యారు. కేవలం పది నిమిషాల సమయంలోనే ఒకే ఇంట్లో రెండు మరణాలు చోటు చేసుకోవడంతో స్థానికంగా రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement