మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం

by Sridhar Babu |
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారయత్నం
X

దిశ, సిరిసిల్ల: మతిస్థిమితం లేని మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడో కీచకుడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బండలింగంపల్లిలో మానసిక వికలాంగురాలు అయిన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ పొలిమేరలకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఓ యువకుడు. బాలిక కేకలు వేయడంతో నిందితడు పారిపోయేందుకు యత్నించాడు. దీంతో గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నరోమీ గ్రామానికి చెందిన మున్నా అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story