- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులో మరోకోణం.. ఏటీఎంలో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..!
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలో ఏకకాలంలో రెండు ఏటీఎంలలో చోరీకి యత్నించాడు ఓ మందుబాబు. ఏటీఎంలకు సంబంధించిన కంపెనీ నిర్వాహకులు సీసీటీవీ సర్వేలైన్స్‌లో పోలీసులను అప్రమత్తం చేయడంతో చోరీ యత్నం విఫలమైంది. సదరు మందుబాబు జైలు పాలయ్యాడు. నిజామాబాద్ 3 టౌన్ ఎస్సై సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గుర్బబాది రోడ్‌లో గల హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. తనతో పాటు తెచ్చుకున్న బండరాయితో ఏటీఎంను పగులగొట్టి, డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నించాడు.
ఏటీఎంకు సంబంధించిన హైదరాబాద్ సీసీటీవీ సర్వేలైన్స్ వారు ఈ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే త్రీ టౌన్ ఎస్సై సంతోష్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పెట్రోలింగ్ వారు అక్కడికి చేరుకోగానే ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి గురించి వెతుకుతూ ఉండగానే.. అదే రోడ్డులోని హిటాచి ఏటీఎంను పగులగొట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఫుల్‌గా మందేసి ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడు జగిత్యాల జిల్లా అంతర్‌గామ్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అని చెప్పాడన్నారు. హిటాచి ఏటీఎం ఇన్‌చార్జీ నూకల నరేందర్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి అనిల్ కుమార్‌ను రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు.