భూ తగాదా కారణంగా కల్లు సీసాతో దాడి.. పరిస్థితి విషమం..

by Shyam |   ( Updated:25 Nov 2021 3:34 AM  )
భూ తగాదా కారణంగా కల్లు సీసాతో దాడి.. పరిస్థితి విషమం..
X

దిశ, దుబ్బాక : భూ తగాదాల్లో భాగంగా పంచాయతీ పెట్టిన పెద్దమనుషుల సాక్షిగా కల్లు సీసాతో దాడి చేసిన ఘటన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నేరెళ్ల పరుశురామ్ గౌడ్ తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంలో గొడవలు కావడంతో స్థానిక కల్లు డిపోలో కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో సహనం కోల్పోయిన కిష్టగౌడ్, అతని కొడుకు సందీప్ పరుశురామ్ గౌడ్ పై ఒక్కసారిగా కల్లు సీసాతో దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దుబ్బాక వైద్యులు సిద్దిపేట ఆసుపత్రికి రిఫర్ చేశారు. తనకు రావాల్సిన వారసత్వం భూమిని అడిగినందుకే ఇలా దాడి చేసి చంపాలని చూశారని తమకు న్యాయం చేయాలని బాధితుడు మీడియా ముందు మొర పెట్టుకున్నాడు.


👉 Read Disha Special stories


Next Story