- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్.. ఫ్లాష్.. వైసీపీ నేతపై ఎటాక్.. చితక్కొట్టిన సొంత పార్టీ నేత(వీడియో)
దిశ, ఏపీ బ్యూరో: సొంత పార్టీ నేతలు చేసిన దాడిలో వైసీపీ కీలక నేత సుబ్బారావు గుప్తా తీవ్ర గాయాలపాలయ్యాడు. సొంత పార్టీ నేతలే అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనెల 12న మంత్రి బాలినేని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సుబ్బారావు గుప్తా రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి నేతల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు. ఈ నేతలు వైసీపీకి మేలు చేస్తున్నారో.. చెడు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఈ నేతల వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాత్రం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అవడంతో సుబ్బారావుకు బెదిరింపులు మొదలయ్యాయి.
కొందరు అదే రోజు రాత్రి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భయపడిన సుబ్బారావు గుప్తా ప్రాణ భయంతో ఓ లాడ్జిలో దాక్కున్నాడు. సుబ్బారావు గుప్తా అదృశ్యంకావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయినప్పటికీ కొందరు సుబ్బారావు గుప్తా వివరాలు చెప్పాలంటూ పలువురు ఇంటికి వెళ్లి మరీ రచ్చరచ్చ చేశారు. ప్రాణ భయంతో సుబ్బారావు ఓ లాడ్జ్‌లో తలదాచుకోగా.. ఆయన ఆచూకీ కనిపెట్టి మరీ వెళ్లారు. దీంతో ఒంగోలుకు చెందిన సుభానీ అనే వైసీపీ నేత దుర్భాషలాడుతూ చితక్కొట్టాడు. చిన్న పిల్లలగలవాడిని… తప్పైందని చెప్పినా వినలేదు. షుగర్ ఉంది కొట్టొద్దని వేడుకున్నా కనికరించలేదు. చెంపలపై తీవ్రంగా దాడి చేశాడు. ఒళ్లు హూనం అయ్యేలా బాదారు. చంపేస్తా.. నిన్ను లేపెయ్యాలంటే 2సెకన్లు చాలు అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడితో సుభానీ శాంతించలేదు. బెడ్‌పై దాడి చేసిన అనంతరం కాలర్ పట్టుకుని కిందకు దించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. వాసన్నా నన్ను క్షమించు అని మరీ చెప్పించారు. ఇకపోతే సుబ్బారావుపై దాడి చేసిన సుభానీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ప్రచారం జరుగుతుంది. సుబ్బారావుతో క్షమాపణ చెప్పించినా కూడా వదలకుండా ఆయన ఇంటిపై కూడా దాడి చేసి దారుణానికి పాల్పడ్డారు. బైక్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. దీన్ని ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా ఖండించాయి.