పార్టీ కార్యాలయంపై దాడి… ఇద్దరు కార్యకర్తలు మృతి

by Shamantha N |   ( Updated:2021-01-19 21:32:12.0  )
పార్టీ కార్యాలయంపై దాడి… ఇద్దరు కార్యకర్తలు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ‌బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై మంగళవారం గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సౌత్ దినాజ్ పూర్ ఎస్పీ దేబర్షి దత్తా తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. పుర్బా బర్దమాన్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ జరగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Next Story