ఆరుగురిపై కత్తితో దాడి.. వ్యక్తి అరెస్ట్

by Shyam |

దిశ, మెదక్: పునరావాసం ప్యాకేజి తనకు కూడా దక్కాలంటూ.. ఓ వ్యక్తి గ్రామానికి చెందిన ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తొగుట మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన లింగోళ్ల సారబందుకు ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. ఆరో కూతురి వివాహం హైదరాబాద్‌కు చెందిన దుర్గ ప్రసాద్‌తో చేసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో మల్లన్న సాగర్ ప్యాకేజీ తనకు కూడా కావాలంటూ.. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Tags: Attack, six members, sword, medak, mallanna sagar package, hyd

Advertisement

Next Story