- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టుపై దాడి.. టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
దిశ, పరకాల: హన్మకొండ జిల్లా ఆత్మకూర్‌కు చెందిన విలేకరి పొగాకు ప్రభాకర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీఆర్ఎస్ కార్యకర్తలను నిందితులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం ఆత్మకూర్‌కు చెందిన ప్రముఖ పత్రిక విలేఖరి ప్రభాకర్ ఇంటిపై కొంతమంది దాడికి యత్నించారు. ఈ మేరకు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు టీఆర్ఎస్ కార్యకర్తలు అని గుర్తించారు.
ఈ కేసులో టీఆర్ఎస్ కార్యకర్తలు రేవూరి సుధాకర్ రెడ్డి, కాంతల కేశవరెడ్డి, బయ్య రాజు, నత్తి సుధాకర్, భాషబోయిన సాగర్, కాకాని రవీందర్, భాషబోయిన మల్లికాంభ, కాకాని రమాదేవి గుండెబోయిన శ్రీలత, గుండెబోయిన రాధిక, నత్తి లక్ష్మీ ప్రసన్న, భయ్య రమ, తనుగుల సునీత, పెరుమండ్ల నీలతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రంజిత్ కుమార్ తెలియజేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జర్నలిస్ట్ యూనియన్(TUWJ) ఆత్మకూరు సీఐ రంజిత్ కుమార్‌తో చర్చించి టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయించినట్లు సమాచారం.